Madanapalle: సాయి ఆలయంలో శ్రీరామ్ చినబాబు ప్రత్యేక పూజలు!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగావు.

Srinivasulu, Madanapalle
Published on: 29 July 2026 4:16 PM IST
Madanapalle
X

Madanapalle: సాయి ఆలయంలో శ్రీరామ్ చినబాబు ప్రత్యేక పూజలు!

మదనపల్లె, జూలై 29: గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మదనపల్లెలోని శ్రీ సాయి బాబా ఆలయంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా యోగేశ్వర్ పెద్ద బాబుతో కలిసి సాయి బాబా ఆశీస్సులు పొందిన ఆయన, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులను కలుసుకుని గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బాబు నాయుడు, టీడీపీ నాయకులు జయరాం రెడ్డి, తెలుగు యువత నాయకులు మెహబూబ్ ఖాన్, కొత్తపేట శ్యామ్, బీజేపీ నాయకులు అజయ్ పండిట్, సింహం శ్రీకాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story