Chittoor: సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే!

Chittoor: చిత్తూరు పీవీకేఎన్ కళాశాల మైదానంలో డిసెంబర్ 12 నుంచి 14 వరకు జరగనున్న రాష్ట్రస్థాయి సీనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ పోస్టర్‌ను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆవిష్కరించారు.

Chandra Sekhar, Chittoor
Published on: 28 Nov 2026 5:00 PM IST
Chittoor
X

Chittoor: సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే! 

Chittoor: చిత్తూరులో డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్న సాఫ్ట్‌బాల్ సీనియర్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్ పోస్టర్‌ను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆవిష్కరించారు. జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, కార్పొరేటర్ పి.ఎస్. చందు ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ, డిసెంబర్ 12 నుంచి 14 వరకు స్థానిక పీవీకేఎన్ కళాశాల క్రీడామైదానంలో నిర్వహించనున్న సీనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్‌ను విజయవంతం చేసేందుకు తనవంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

ఇప్పటికే జిల్లా కలెక్టర్‌తో కూడా మాట్లాడినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా చిత్తూరుకు విచ్చేయనున్న క్రీడాకారులు, కోచ్‌లు, సిబ్బంది, అధికారులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేలా జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్‌కు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ చైర్మన్ పి. షణ్ముగం మాట్లాడుతూ, ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో సుమారు వెయ్యి మంది క్రీడాకారులు పాల్గొననున్నారని తెలిపారు. పోటీల నిర్వహణకు అవసరమైన క్రీడామైదానం, భోజన వసతి, ఇతర మౌలిక సదుపాయాలను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే సహకారంతో సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ రాష్ట్ర కార్యదర్శి వి. సురేంద్ర కుమార్, పార్టీ నాయకులు కిషోర్, ద్వారకనాథ్, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్లు కృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor