Sullurupeta: మెగా యూత్ ఫోర్స్ స్టేట్ కో-కన్వీనర్‌గా షేక్ మాబాషా!
Sullurupeta: సూళ్ళూరుపేటకు చెందిన కారు డ్రైవర్ షేక్ మాబాషా మెగా యూత్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో-కన్వీనర్‌గా ఎంపికయ్యారు.
Sullurupeta: మెగా యూత్ ఫోర్స్ స్టేట్ కో-కన్వీనర్‌గా షేక్ మాబాషా!
Sullurupeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణానికి చెందిన షేక్ మాబాషా ‘మెగా యూత్ ఫోర్స్’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ స్టేట్ కో-కన్వీనర్‌గా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన నియామకంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, ఎలాంటి రాజకీయ లేదా ఆర్థిక నేపథ్యం లేనప్పటికీ.. కేవలం ప్రజాసేవా దృక్పథంతో ఆయన ఈ స్థాయికి ఎదగడం విశేషం.
వృత్తిరీత్యా కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న షేక్ మాబాషా.. తన కష్టార్జితంలో కొంత భాగం నిరుపేదల సంక్షేమం కోసం కేటాయిస్తున్నారు. గతంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేసిన కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆయన చేసిన సేవలు స్థానికంగా ఎంతో గుర్తింపు తెచ్చాయి. చిరంజీవి సేవా సంఘం ద్వారా అనేక సామాజిక, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలకు నిరంతరం అండగా నిలుస్తున్నారు.
ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి చేయూతనివ్వడంతో పాటు, ఉపాధి లేని యువతకు సేవా సంస్థల ద్వారా మార్గదర్శకం చేస్తూ వస్తున్నారు. సమాజం పట్ల ఆయన చూపుతున్న అంకితభావం, నిస్వార్థ సేవలను గుర్తించిన మెగా యూత్ ఫోర్స్ పెద్దలు ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా షేక్ మాబాషా మాట్లాడుతూ.. తనపై ఉంచిన నమ్మకానికి తగ్గట్టుగా రాష్ట్రంలో యువతను సంఘటితం చేస్తూ ప్రజాసేవను మరింత విస్తృతం చేస్తానని తెలిపారు.
ఆయన రాష్ట్ర కో-కన్వీనర్‌గా ఎన్నికవడం పట్ల సూళ్ళూరుపేట పట్టణ ప్రజలు, మెగా అభిమానులు, వివిధ సేవా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా అభినందనలు తెలిపారు.




