Tamballapalle: కవలలకు జన్మ వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం కోరుతున్న దంపతులు
Tamballapalle: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం పీటీయం దంపతుల కవల పిల్లలకు బెంగళూరు రెయిన్‌బో ఆసుపత్రిలో చికిత్స.
Tamballapalle: కవలలకు జన్మ వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం కోరుతున్న దంపతులు
తంబళ్లపల్లి: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని పీటీయం మండలానికి చెందిన సాయి వర్ధన్, శిరీష దంపతులకు మదనపల్లెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఏడు నెలల గర్భధారణలోనే కవలలు జన్మించారు. వీరికి ఇద్దరు మగ బిడ్డలు అకాల ప్రసవం కారణంగా శిశువుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రస్తుతం బెంగళూరులోని రెయిన్‌బో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. శిశువుల చికిత్స కోసం రోజుకు సుమారు రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతోందని బాధితురాలు శిరీష తెలిపారు.
గురువారం మదనపల్లె ప్రెస్ క్లబ్‌లో మీడియాను ఆశ్రయించిన ఆమె మాట్లాడుతూ, తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి చికిత్స ఖర్చులను భరించే స్థితిలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు దాతలు, ప్రజాప్రతినిధులు, సేవా సంస్థలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని వేడుకున్నారు.
కవలల చికిత్స కోసం మానవతా దృక్పథంతో స్పందించి సహాయం చేయాలనుకునే వారు ఫోన్‌పే నంబర్ 8143633396 ద్వారా తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించవచ్చని బాధితులు కోరారు. తమ చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని దంపతులు విజ్ఞప్తి చేశారు.




