Gangavaram: 40 ఏళ్లుగా తీరని దారి కష్టాలు.. హరిజనవాడ గ్రామస్తుల ఆవేదన
Gangavaram: గంగవరం మండలం తమ్మిరెడ్డిపల్లి హరిజనవాడలో 40 ఏళ్లుగా రోడ్డు దారి సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడంతో గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Gangavaram: 40 ఏళ్లుగా తీరని దారి కష్టాలు.. హరిజనవాడ గ్రామస్తుల ఆవేదన
Gangavaram: గంగవరం మండల.. పరిధిలో ఉన్న తమ్మిరెడ్డిపల్లి హరిజనవాడ కు 40 సంవత్సరాలుగా దారి సమస్య ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాకపోకలకు అనువుగా ఉన్న ప్రదేశాన్ని కూడా మాకు పట్టా ఉందని కొంతమంది రాళ్లు నాటుకున్నారని ఇప్పుడు గ్రామానికి వెళ్లడానికి రావడానికి పూర్తిగా దారి లేకుండా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
మరి ముఖ్యంగా చిన్నపిల్లలు స్కూల్ కి పోవడానికి రావడానికి కూడా దారి లేకపోవడంతో ఒక కిలోమీటర్లు తీసుకెళ్లి పిల్లల్ని వదిలి రావాల్సిన పరిస్థితి వస్తుందని గ్రామస్తులు తెలుపుతున్నారు.
ప్రజా ప్రతినిధులు కానీ, అధికారులు కానీ తమ బాధను తీర్చడానికి ముందుకు రాకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియకుండా అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గ్రామంలో మౌలిక వసతులు కూడా సరిగా లేవని తాగడానికి నీరు, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా ఇబ్బందికరంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.




