Chinturu: చింతూరు సమీపంలో టాటా ఏస్ బోల్తా.. ముగ్గురికి తీవ్ర గాయాలు!
Chinturu: సింగన్నగూడెం - గంగన్నమెట్ట గ్రామాల మధ్య జాతీయ రహదారి 30 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం పశువులను తప్పించబోయి బోల్తా.
Chinturu: చింతూరు సమీపంలో టాటా ఏస్ బోల్తా.. ముగ్గురికి తీవ్ర గాయాలు!
చింతూరు: మండలం సింగన్నగూడెం - గంగన్నమెట్ట గ్రామాల మధ్య జాతీయ రహదారి పై టాటా ఎస్ వాహనం బోల్తా పడింది.భద్రాచలం నుంచి పదిమంది కూలీలను చింతూరులోని ఎర్రంపేట గ్రామంలో పనికి టాటా యస్ వాహనంలో తీసుకొని వస్తున్నారు.
ఈ సమయంలో జాతీయ రహదారి 30 పై టాటా ఏస్ వాహనం ఎదురుగా వస్తున్న పశువులను తప్పించబోయి బోల్తా పడింది. వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురుకు తీవ్ర గాయాలు పాలయ్యారు.
క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం చింతూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు.చింతూరు పోలీస్ అధికారులు ఈ ప్రమాదం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




