Madanapalle: మదనపల్లె 43వ వార్డులో టీడీపీ విజయం!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ 43వ వార్డులో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆర్. రత్నమయ్య.
Madanapalle: మదనపల్లె 43వ వార్డులో టీడీపీ విజయం!
Madanapalle: మదనపల్లె మున్సిపాలిటీ 43వ వార్డు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ఆర్. రత్నమయ్య వార్డు ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఓటు వేసి, ఆదరించి ఘన విజయాన్ని అందించిన 43వ వార్డు ప్రజలకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
తన విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ విజయం తన ఒక్కరిదే కాదని, 43వ వార్డు ప్రజలందరి విజయమని పేర్కొన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వార్డు అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనను ఆదరించి ఘన విజయం అందించిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.




