Madanapalle: అరుణాచలేశ్వరుని సేవలో టీడీపీ నేత కట్టా దొరస్వామి నాయుడు!
Madanapalle: తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలంలో శ్రీ అరుణాచలేశ్వర స్వామివారిని దర్శించుకున్న టీడీపీ సీనియర్ నేత కట్టా దొరస్వామి నాయుడు.
Madanapalle: అరుణాచలేశ్వరుని సేవలో టీడీపీ నేత కట్టా దొరస్వామి నాయుడు!
అరుణాచలేశ్వరుని దర్శించుకున్న టీడీపీ సీనియర్ నేత కట్టా దొరస్వామి నాయుడు
మదనపల్లె, జూలై 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ సీనియర్ నాయకులు కట్టా దొరస్వామి నాయుడు తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలంలో శ్రీ అరుణాచలేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అర్చకుల ఆశీర్వాదాలు స్వీకరించిన ఆయన రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కట్టా దొరస్వామి నాయుడు మాట్లాడుతూ, అరుణాచలేశ్వరుని దర్శించుకోవడం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందన్నారు.
భక్తి, విశ్వాసాలతో స్వామివారిని దర్శించుకోవడం జీవితంలో మరపురాని అనుభవమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అవకాశం వచ్చినప్పుడు అరుణాచలేశ్వర స్వామివారిని దర్శించుకుని దైవ అనుగ్రహాన్ని పొందాలని ఆయన ఆకాంక్షించారు.




