Madanapalle: మదనపల్లె 34వ వార్డులో టీడీపీ ఓటరు అవగాహన!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె 34వ వార్డులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ. ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించిన టీడీపీ ఇన్‌చార్జ్ బాలమాలి శేఖర్.
Madanapalle: మదనపల్లె 34వ వార్డులో టీడీపీ ఓటరు అవగాహన!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని 34వ వార్డులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో టీడీపీ 34వ వార్డు ఇన్‌చార్జ్ బాలమాలి శేఖర్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు.
వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బాలమాలి శేఖర్ మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, ఎస్‌ఐఆర్ ప్రక్రియను ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Next Story




