Annamayya: కట్టా దొరస్వామి నాయుడు జన్మదిన వేడుకలు ఘనం

Annamayya: టీడీపీ రాష్ట్ర నాయకులు కట్టా దొరస్వామి నాయుడు జన్మదిన వేడుకలు మెలకలచెరువులో ఘనంగా నిర్వహించారు.

Srinivasulu, Madanapalle
Published on: 11 May 2026 3:11 PM IST
Annamayya
X

Annamayya

అన్నమయ్య: అన్నమయ్య జిల్లా మెలకలచెరువు మండలంలోని కేజీఎన్ కళ్యాణ మండపంలో సీనియర్ టీడీపీ రాష్ట్ర నాయకులు కట్టా దొరస్వామి నాయుడు జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లైఫ్ కేర్ రాజా పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.

అనంతరం మాట్లాడుతూ, ప్రజా సేవలో కట్టా దొరస్వామి నాయుడు చేసిన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు.

అనంతరం కేక్ కట్ చేసి అభిమానులు, నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు నాయకులు ఆయన సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఆధార్ పవన్ కుమార్, భరత్, అఖిల్, బారేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story