Punganur: వ్యక్తిగత విమర్శలపై టీడీపీ ఆగ్రహం
Punganur: బీసీవై పార్టీ నేతలకు టీడీపి సీనియర్ నాయకుడు మధుసూదన్ రాయల్ ఘాటు కౌంటర్
Punganur: వ్యక్తిగత విమర్శలపై టీడీపీ ఆగ్రహం
పుంగనూరు: మా నాయకుడు పై చౌకబారు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు టిడిపి నాయకులు మధుసూదన్ రాయల్ గత మూడు రోజుల క్రితం బిసివై పార్టీ ప్రేమ్ కుమార్, హరిబాబు యాదవ్ లు తెలుగుదేశం పార్టీ పైన మీడియా సమావేశం ఏర్పాటు చేసి విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ రాయల్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు తండ్రి గారైన ఖర్జూరపు నాయుడు సొత్తి ఏమైనా ఇస్తున్నాడా అని మాట్లాడాడని ఏది ఏమైనా గానీ రాజకీయపరంగా విమర్శలు చేసుకోవాలి కానీ కుటుంబ సభ్యులు జ్యోలికి గాని వ్యక్తిగత విషయాలు గానీ వేళ్ళకూడదని ఆయన అన్నారు.
దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకుని రావాలని గత మూడు రోజుకితం మీరు చేసిన ఆరోపణలకు మేము కట్టుబడి ఉన్నామన్నారు. మీ నాయకుడి దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే బోడే రామచంద్ర యాదవ్ ప్రమాణానికి హజరుకావాలని ఆయన అన్నారు.
విద్యహక్కు చట్టం ఇప్పుడే గుర్తుకొచ్చిందా గత వైకాపా ప్రభుత్వంలో ఈ విద్యా హక్కు చట్టం బోడె రామచంద్ర యాదవ్ కు గుర్తు రాలేదా? నేను సవాల్ విసరింది బోడే రామచంద్ర యాదవ్ కని, ఐతే అతని స్థానంలో అతని చెంచాలు వచ్చి ఆర్బాటాలు చేస్తున్నారన్నారు.




