Madanapalle: వివేకానంద పాఠశాలకు రోజూ నీటి ట్యాంకర్ సరఫరా!
Madanapalle:మదనపల్లె వివేకానంద పాఠశాలలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తూ టీడీపీ ఇంచార్జ్ మధుసూదన్ రెడ్డి ప్రతిరోజూ నీటి ట్యాంకర్ పంపేలా ఏర్పాట్లు చేశారు.
Madanapalle: వివేకానంద పాఠశాలకు రోజూ నీటి ట్యాంకర్ సరఫరా!
Madanapalle: మదనపల్లె పట్టణంలోని రామిరెడ్డి లేఔట్లో ఉన్న వివేకానంద పాఠశాలలో తాగునీటి కొరత కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న టీడీపీ 32వ వార్డు ఇంచార్జ్ మండిపల్లి ( జెసిబి ) మధుసూదన్ రెడ్డి వెంటనే స్పందించారు. గౌరవ ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా ఆదేశాల మేరకు పాఠశాలలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిశీలించిన మధుసూదన్ రెడ్డి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిషారం లభించే వరకు ప్రతిరోజూ ఒక నీటి ట్యాంకర్ను పాఠశాలకు పంపించేలా ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల సంక్షేమం, వారి ఆరోగ్యం తమకు అత్యంత ముఖ్యమని, ప్రజా సమస్యల పరిష్కారంలో తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. నీటి సమస్యపై వెంటనే స్పందించి చర్యలు చేపట్టిన టీడీపీ 32వ వార్డు ఇంచార్జ్ మధుసూదన్ రెడ్డికి పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.




