Palamaner: వైసీపీ అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మరు: మౌలానా ముస్తాక్!

Palamaner: పలమనేరులో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ నేత మౌలానా ముస్తాక్ అహ్మద్ పాల్గొన్నారు.

SUBRAMANYAM, PALAMANERU
Published on: 4 Aug 2026 5:25 PM IST
Palamaner
X

Palamaner: వైసీపీ అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మరు: మౌలానా ముస్తాక్!

పలమనేరు: రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వంలో చంద్రన్న విజయాలు చూస్తున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు మౌలానా ముస్తక్ అహ్మద్ పేర్కొన్నారు. పలమనేర్ పట్టణంలోని కాకా తోపు, కిట్టన్న మిషన్ వీధి ప్రాంతాలలో బుధవారం జరిగిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని, రాష్ట్రం బాగుండాలి బాగు చేయాలనేదే చంద్రబాబు నిజమైనదని అయితే అభివృద్ధిని చేస్తున్న సంక్షేమాన్ని చూసి ఓర్వలేక వైసీపీ విమర్శలు చేస్తోందన్నారు.

ఆనాడు రాష్ట్రంలో మోకాళ్ళ లోతు గుంతలమైన రహదారులతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని నేడు ఏ గ్రామానికి వెళ్లిన నాణ్యమైన రోడ్లను చూడొచ్చని అన్నారు. అదేవిధంగా ఉచిత ఆర్టీసీ బస్సు , తల్లికి వందనం పథకాలతో రాష్ట్రంలోని మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారని వివరించారు.

ఇక ఒక డీఎస్సీ కూడా పెట్టేందుకు వైసిపికి చేతకాలేదు కానీ దాన్ని పటిష్టంగా కూటమి చేస్తే ఓర్చుకోలేకపోతోందని విమర్శించారు. వైకాపా అబద్ధపు ప్రచారాలపై ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. ఇకపై కూడా ప్రజలేవరు మోసపోరని మళ్లీమళ్లీ బాబే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బాలాజీ కో-ఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్ వి బాలాజీ, సీనియర్ నాయకులు బ్రహ్మయ్య, జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఖాజాపీర్, చాంద్ భాష, మాభాష, జావిద్, ముబారక్, ఫైజుల్ల,మౌలా, జిలాని లతో పాటు పట్టణ నాయకులు నాగరాజు, బీఆర్సి కుమార్, కోటేశ్వర్ తదితరులు ఉన్నారు.

SUBRAMANYAM, PALAMANERU

SUBRAMANYAM, PALAMANERU

Next Story