B Kothakota: బీ కొత్తకోట మున్సిపల్ ఆఫీసులో ఘనంగా యోగా దినోత్సవం

B Kothakota: ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా బీ కొత్తకోట మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక యోగా కార్యక్రమం.

Srinivasulu, Madanapalle
Published on: 21 Jun 2026 2:25 PM IST
B Kothakota
X

B Kothakota: బీ కొత్తకోట మున్సిపల్ ఆఫీసులో ఘనంగా యోగా దినోత్సవం

బీ కొత్తకోట: ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా బీ కొత్తకోట మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.ఎం. పర్వీన్ తాజ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని, ప్రపంచ శాంతి మరియు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యోగాను ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు.

ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మానసిక వికాసం కూడా సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు బంగారు వెంకటరమణ, క్లస్టర్ ఇంచార్జ్ కనకంటి ప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ డేరంగుల నారాయణ, మున్సిపల్ సిబ్బంది, మహిళలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story