Madanapalle: మదనపల్లెలో టీడీపీ నేత శేషాచలపతి నాయుడు బర్త్‌డే వేడుకలు.. శ్రేణుల సందడి!

Madanapalle: చిత్తూరు జిల్లా మదనపల్లెలో టీడీపీ సీనియర్ నాయకులు శేషాచలపతి నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

Srinivasulu, Madanapalle
Published on: 7 July 2026 12:39 PM IST
Madanapalle: మదనపల్లెలో టీడీపీ నేత శేషాచలపతి నాయుడు బర్త్‌డే వేడుకలు.. శ్రేణుల సందడి!
X

మదనపల్లె: టీడీపీ సీనియర్ నాయకులు శేషాచలపతి నాయుడు జన్మదిన వేడుకలను సోమవారం మదనపల్లెలోని శ్రీకృష్ణ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న లైఫ్ కేర్ మెడికల్స్ వద్ద లైఫ్ కేర్ మెడికల్స్ ప్రసాద్, రాజశేఖర్, చంద్రశేఖర్ (చంటి) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శేషాచలపతి నాయుడికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా లైఫ్ కేర్ మెడికల్స్ ప్రసాద్ మాట్లాడుతూ, శేషాచలపతి నాయుడు ప్రజల కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ సేవాభావంతో పనిచేసే నాయకుడని కొనియాడారు. పార్టీ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి ఆదర్శనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం లైఫ్ కేర్ మెడికల్స్ రాజశేఖర్ మాట్లాడుతూ, శేషాచలపతి నాయుడు ప్రజలతో ఎల్లప్పుడూ సన్నిహితంగా ఉంటూ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు. ఆయన మరెన్నో సంవత్సరాలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రజల ఆశీస్సులు, ఆదరణతో శేషాచలపతి నాయుడు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ హాకీ ప్లేయర్ గురు భాస్కర్, కట్టా లక్ష్మీనారాయణ, దొరస్వామి నాయుడు, బోనాల ఉమేష్, గిరి రాయల్, మురళి, మస్తాన్ రెడ్డి, డి.కే. నారాయణ, ఆధార్ పవన్, ఉపేంద్ర, రామపురం శీనా, కుమార్, మహాదేవ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వ్యాపారవేత్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొని శేషాచలపతి నాయుడికి పుష్పగుచ్ఛాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలు ఉత్సాహభరితంగా, ఆప్యాయ వాతావరణంలో ఘనంగా జరిగాయి.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story