Madanapalle: 35వ వార్డులో ఘనంగా పింఛన్ల పంపిణీ!

Madanapalle: మదనపల్లె 35వ వార్డులో సచివాలయ సిబ్బందితో కలిసి టీడీపీ నాయకులు పింఛన్లను పంపిణీ చేశారు.

Srinivasulu, Madanapalle
Published on: 1 Aug 2026 9:47 AM IST
Madanapalle
X

Madanapalle: 35వ వార్డులో ఘనంగా పింఛన్ల పంపిణీ!

Madanapalle: మదనపల్లె ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ భాషా ఆదేశాల మేరకు 35వ వార్డులో ప్రతినెల నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వార్డు లో తెలుగుదేశం పార్టీ నాయకులు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందితో కలిసి అర్హులైన లబ్ధిదారులకు సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేశారు.

రాష్ట్రంలో ప్రతి నెల నిర్వహించే అతిపెద్ద సామాజిక సంక్షేమ కార్యక్రమమైన పింఛన్ల పంపిణీని సజావుగా నిర్వహించి, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు సకాలంలో అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రమేష్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది మరియు స్థానికులు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story