Madanapalle: మదనపల్లెలో వైకుంఠ సమారాధన.. నివాళులర్పించిన శ్రీరామ్ చినబాబు
Madanapalle: మదనపల్లెలో ఘనంగా జరిగిన యల్లంపల్లి సూర్యప్రకాష్ వైకుంఠ సమారాధన. హాజరైన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు.
Madanapalle: మదనపల్లెలో వైకుంఠ సమారాధన.. నివాళులర్పించిన శ్రీరామ్ చినబాబు
మదనపల్లె: మదనపల్లె పట్టణంలోని స్థానిక ఆర్య వైశ్య హాస్టల్లో నిర్వహించిన యల్లంపల్లి సూర్యప్రకాష్ వైకుంఠ సమారాధన కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు పాల్గొన్నారు.
బీజేపీ నాయకుడు యల్లంపల్లి ప్రశాంత్ తండ్రి యల్లంపల్లి సూర్యప్రకాష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ, యల్లంపల్లి సూర్యప్రకాష్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో దేవత స్టోర్స్ అధినేత సతీష్, తెలుగు యువత నాయకుడు మహబూబ్ ఖాన్, బీజేపీ యువ నాయకుడు శ్రీకాంత్‌తో పాటు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు పాల్గొని యల్లంపల్లి సూర్యప్రకాష్‌కు ఘనంగా నివాళులర్పించారు.




