Chittoor: కులం పేరుతో దూషించిన ఉపాధ్యాయుడి సస్పెన్షన్!

Chittoor: చిత్తూరు జిల్లా అరగొండ జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులను కులం పేరుతో దూషించిన ఉపాధ్యాయుడు సస్పెన్షన్. డీఈవో ఉత్తర్వులు జారీ.

VASU, PUTTALAPATTU
Published on: 23 Aug 2026 9:24 AM IST
Chittoor
X

Chittoor: కులం పేరుతో దూషించిన ఉపాధ్యాయుడి సస్పెన్షన్!

Chittoor: పూతలపట్టు నియోజకవర్గం, అరగొండ జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో విద్యార్థులను, తల్లిదండ్రుల ను కులం పేరుతో ఉపాధ్యాయుడు సునీల్ కుమార్ దూషించాడని ఆరోపణలపై, విద్యార్థుల తల్లిదండ్రులు,ఎస్సీ సంఘం, బీఎస్పీ నాయకులు, మండల, జిల్లా విద్యాశాఖ అధికారులకు, మానవ హక్కుల కమిషన్ వారికి ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు మేరకు జిల్లా విద్యాశాఖ డివై ఈవో ఇందిరా విచారణ కమిటీని నియమించింది. విచారణ కమిటీ పాఠశాలకు వెళ్లి విచారణ నిర్వహించి నివేదికను విద్యాశాఖ అధికారులకు తెలియజేశరు. కమిటీ నివేదించిన ఆధారాల మేరకు కులం పేరుతో దూషించారన్న ఉపాధ్యాయుడు సునీల్ కుమార్ ను సస్పెన్షన్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంఈఓ ప్రేమలతో తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మహేశ్ సే రేష్, తదితరులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU

Next Story