Madanapalle: మృతుల కుటుంబాలను పరామర్శించిన శ్రీరామ్ చినబాబు!
Madanapalle: మదనపల్లెలో రైల్వే ప్రమాద బాధితుడు షేక్ ఇస్మాయిల్ కుటుంబ సభ్యులను తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు పరామర్శించారు.
Madanapalle: మృతుల కుటుంబాలను పరామర్శించిన శ్రీరామ్ చినబాబు!
Madanapalle: రైల్వే ప్రమాదంలో దుర్మరణం చెందిన షేక్ ఇస్మాయిల్ మృతదేహానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మదనపల్లి రూరల్ మండలం కొత్తవారిపల్లె మాజీ సర్పంచ్ మహేష్ మాతృమూర్తి శ్రీమతి పోతబోలు లక్ష్మీదేవమ్మ మృతికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్పి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు సీడ్ మల్లికార్జున నాయుడు, యాలగిరి దొరస్వామి నాయుడు, రన్ టీవీ ఛానల్ అధినేత సిరివేల చరణ్, బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్, అలాగే కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని మృతులకు ఘనంగా నివాళులర్పించారు.
Next Story




