Mulakalacheruvu: హాలేబీడు బేలూరు కు తీసిపోని సోంపాళ్యం దేవాలయం

Mulakalacheruvu: అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలంలోని సోంపాళ్యం చెన్నకేశవాలయం శిల్పకళా వైభవానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది.

RAMAKRISHNA REDDY, THAMBALAPALLE
Published on: 15 May 2026 11:06 AM IST
Mulakalacheruvu
X

Mulakalacheruvu: హాలేబీడు బేలూరు కు తీసిపోని సోంపాళ్యం దేవాలయం

ములకలచెరువు: అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి తాలూకా, ములకలచెరువు మండలం, లోని సోంపాళ్యం చెన్నకేశవాలయం జిల్లాలో ప్రఖ్యాతి గాంచిన దేవాలయం ఆలయం ముందువున్న ఏకశిలా ధ్వజస్తంభం 78 అడుగుల ఎత్తు గల రాతిని తొలచి నిర్మించారు చోళుల కాలం 16 వ శతాబ్దంలో నిర్మించిన ఈ దేవాలయం శిల్ప కళలో హాలేబీడు,బేలూరుకు ఏమాత్రం తీసిపోదు జ్యూవెలరీ బాక్స్ ఆఫ్ సోంపాళ్యం గా పిలవబడుతుంది.

ఈ ఆలయం ముందున్న ధ్వజస్తంభం భూమిలోకి 25 అడుగుల లోతుకి భూమిపైన 53 అడుగులు ఒకే రాతిని మొలచి ధ్వజ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఆలయం ఎదురుగా ఉన్న ఏకశిలా స్తంభం చక్కని శిలాకృతులతో విరాజిల్లుతుంది. ప్రస్తుతం ఈ గుడిని కేంద్ర ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు.

RAMAKRISHNA REDDY, THAMBALAPALLE

RAMAKRISHNA REDDY, THAMBALAPALLE

Next Story