Madanapalle: చిప్పిలి గ్రామంలో పులి సంచారం కలకలం!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం చిప్పిలి గ్రామంలో పులి అడుగుజాడల కలకలం.
Madanapalle: చిప్పిలి గ్రామంలో పులి సంచారం కలకలం!
అన్నమయ్య జిల్లా: మదనపల్లె మండలం పొన్నేటిపాలెం పంచాయతీ పరిధిలోని చిప్పిలి గ్రామంలో పులి సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన కృష్ణ కిషోర్ పొలంలో పులి అడుగుజాడలు గుర్తించినట్లు సమాచారం రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గుర్తులను పరిశీలించిన అనంతరం పులి సంచారం ఉన్నట్లు నిర్ధారించేందుకు చర్యలు చేపట్టారు. ఈ విషయంపై మదనపల్లె తహసీల్దార్‌కు కూడా సమాచారం అందించారు.
గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా పొలాల వైపు వెళ్లవద్దని ఫారెస్ట్ అధికారులు సూచించారు. పులి కదలికలను గుర్తించేందుకు అటవీ శాఖ సిబ్బంది నిఘా ఏర్పాటు చేశారు.
Next Story




