Tiruchanur: తిరుచానూరు DCCB బ్యాంక్‌లో శ్రావణ సహకార డిపాజిట్ పథకం!

Tiruchanur: తిరుచానూరు DCCB బ్యాంకులో శ్రావణ సహకార డిపాజిట్ పథకం 456 రోజుల డిపాజిట్‌పై గరిష్టంగా 8.30% వరకు వడ్డీ ఆఫర్.

K VENU, TIRUPATHI RURAL
Published on: 4 Sept 2026 12:09 PM IST
Tiruchanur
X

Tiruchanur: తిరుచానూరు DCCB బ్యాంక్‌లో శ్రావణ సహకార డిపాజిట్ పథకం!

Tiruchanur: తిరుచానూరు డిసిసిబి బ్యాంకు ఖాతాదారులు వినియోగదారులకు గరిష్ట ప్రయోజనాలు కల్పించాలని ఉద్దేశంతో ది చిత్తూర్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ సరికొత్తగా శ్రావణ సహకార డిపాజిట్ పథకం ను ప్రవేశపెట్టిందని తిరుచానూరు డిసిసిబి బ్యాంక్ మేనేజర్ లక్ష్మీదేవి తెలిపారు. 456 రోజుల కాల పరిమితితో స్థిర డిపాజిట్ తరహాలలో ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.

ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ ప్రత్యేక డిపాజిట్ పథకంలో ఉందన్నారు. ఈ పథకం సాధారణ ఖాతాదారులు 60 సంవత్సరాల వరకు వయసున్న వారికి 7.60 శాతం 60 సంవత్సరాలనుంచి 79 సంవత్సరాల వయసుగల వృద్ధులకు 8.20 శాతం 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు కూడా 8.20 శాతం వార్షిక వడ్డీ అందిస్తున్నట్టు మేనేజర్ తెలిపారు. అలాగే డిపాజిట్ పై వచ్చే వడ్డీ నెలవారీ లేదా మూడు నెలలకు ఒకసారి పొందే సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.

అత్యవసర అవసరాల సమయంలో స్థిర డిపాజిట్ పై రుణ సౌకర్యం పొందవచ్చుని వివరించారు. పొదుపును సురక్షితంగా పెంచుకోవడంతో పాటు ఆకర్షణీయమైన వడ్డీ రాబడి పొందేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఖాతాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సెప్టెంబర్ 30 లోపు శ్రావణ సహకార డిపాజిట్ పథకంలో భాగస్వాములు కావాలని తిరుచానూరు డిసిసిబి బ్యాంకు మేనేజర్ లక్ష్మీదేవి కోరారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL

Next Story