Srikalahasti: ఫ్లైఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి!
Srikalahasti: తిరుపతి: శ్రీకాళహస్తి మండలం తొండమనాడు ఫ్లైఓవర్ వద్ద ఎదురెదురుగా బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒక యువకుడు మృతి; మరొకరికి తీవ్ర గాయాలు.
Srikalahasti: ఫ్లైఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి!
Srikalahasti: శ్రీకాళహస్తి మండలం తొండమనాడు ఫ్లైఓవర్ సమీపంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ప్రమాదంలో శ్రీకాకుళానికి చెందిన లక్ష్మణ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు సమాచారం. మరో యువకుడు తీవ్రంగా గాయపడగా, అతడిని శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.




