Palamaneru: ఆంధ్రజ్యోతి విలేఖరి హత్య కేసులో ఇద్దరు అరెస్టు

Palamaneru: పలమనేరు ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు.

SUBRAMANYAM, PALAMANERU
Published on: 8 May 2026 3:32 PM IST
Palamaneru
X

Palamaneru

Palamaneru: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట మండలంలో ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

హత్య కేసులో నిందితులైన తమీమ్, సుభాన్‌లను పీటీ వారెంట్‌పై బెంగళూరు నుంచి పలమనేరు కోర్టుకు తీసుకువచ్చినట్లు తెలిపారు. అనంతరం న్యాయస్థానం వారిని 15 రోజుల రిమాండ్‌కు మదనపల్లి కోర్టుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

ఈ హత్య వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని, సమగ్ర విచారణ కోసం నిందితులను పోలీస్ కస్టడీకి అప్పగించాలని వీకోట పోలీసులు కోర్టును ఆశ్రయించినట్లు డీఎస్పీ తెలిపారు.

జర్నలిస్టు హత్య కేసులో పూర్తి నిజాలు వెలికితీసేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

SUBRAMANYAM, PALAMANERU

SUBRAMANYAM, PALAMANERU

Next Story