Chittoor: మద్యం మత్తులో మహిళపై బీరు సీసాలతో దాడి!
Chittoor: చిత్తూరు జిల్లా వి.కోట మండలం సుద్దులకుప్పంలో దారుణం. వాటర్ బాటిల్ అప్పు ఇవ్వలేదని మహిళపై బీరు సీసాలతో దాడి చేసిన ముగ్గురు మద్యం మత్తులోని యువకులు.
Chittoor: మద్యం మత్తులో మహిళపై బీరు సీసాలతో దాడి!
Chittoor: వాటర్ బాటిల్ అప్పు ఇవ్వనందుకు మద్యం మత్తులో ముగ్గురు యువకులు ఓ మహిళపై దారుణంగా దాడి చేసిన ఘటన వి.కోట మండలం సుద్దులకుప్పం గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన యశోద అనే మహిళను స్థానిక అంగడిలో వాటర్ బాటిల్ అప్పు అడిగారు.
అయితే సుబ్రహ్మణ్యం, గిరి, మునింద్ర అనే ముగ్గురు యువకులు మద్యం మత్తులో ఉండి, అప్పు ఇవ్వలేదనే ఆగ్రహంతో బీరు బాటిళ్లతో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారని సమాచారం. ఈ దాడిలో యశోద తలకు తీవ్ర గాయాలు కాగా, ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం కుప్పం పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. రాత్రి 9 గంటల సమయంలో ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Next Story




