Vempalli: డాక్టర్ ఎన్. తులసిరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు

Vempalli: వేంపల్లిలో ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ డాక్టర్ ఎన్. తులసిరెడ్డి పుట్టినరోజు వేడుకలు. మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు.

Srinivasulu, Madanapalle
Published on: 1 Aug 2026 3:57 PM IST
Vempalli
X

Vempalli: డాక్టర్ ఎన్. తులసిరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు

వేంపల్లి: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు, ఉమ్మడి కడప జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎన్. తులసిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా శనివారం కడప జిల్లా వేంపల్లిలోని ఆయన స్వగృహంలో మదనపల్లె నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్. రెడ్డీ సాహెబ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి డాక్టర్ ఎన్. తులసిరెడ్డి అందించిన సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు. మాజీ రాజ్యసభ సభ్యునిగా, మాజీ ఎమ్మెల్సీగా, 20 సూత్రాల అమలు కమిటీ మాజీ చైర్మన్‌గా, ఉమ్మడి కడప జిల్లా పరిషత్ మాజీ చైర్మన్‌గా, ప్రస్తుతం ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్‌గా ఆయన విశిష్ట సేవలందిస్తున్నారని తెలిపారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోవడంలో ఆయన పాత్ర కీలకమని అన్నారు. భగవంతుని ఆశీస్సులతో డాక్టర్ ఎన్. తులసిరెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఏపీసీసీ జనరల్ సెక్రటరీ, మాజీ అన్నమయ్య జిల్లా డీసీసీ అధ్యక్షులు ఎస్. అల్లాబకష్, రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్షులు ఎస్. మహబూబ్ బాషా, అన్నమయ్య జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి పి. ముబారక్ ఖాన్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బి. శరత్ కుమార్ రెడ్డి, మదనపల్లె టౌన్ మాజీ కార్యదర్శి మహమ్మద్ అలీ, పీలేరు మండల మైనారిటీ నాయకులు ఇర్ఫాన్, డీసీసీ మాజీ కార్యదర్శి యూసఫ్ అలీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని డాక్టర్ ఎన్. తులసిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story