Madanapalle: మదనపల్లెలో మున్సిపాలిటీ బోరు తవ్వకాలపై రచ్చ
Madanapalle: మదనపల్లె తాగునీటి బోరు తవ్వకాలను వేంపల్లి ప్రజలు అడ్డుకున్నారు. భూగర్భ జలాలు పడిపోతాయని ఆందోళన చేపట్టడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
Madanapalle: మదనపల్లెలో మున్సిపాలిటీ బోరు తవ్వకాలపై రచ్చ
మున్సిపాలిటీ కోసం బోరు తవ్వకాలు.. అడ్డుకున్న వేంపల్లి గ్రామస్థులు
మదనపల్లె, జూలై 23: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో నెలకొన్న తాగునీటి కొరతను దృష్టిలో ఉంచుకుని అర్బన్ మున్సిపాలిటీకి నీటి సరఫరా కోసం వేంపల్లి పంచాయతీ పరిధిలో బోరు తవ్వేందుకు అధికారులు బుధవారం అక్కడికి చేరుకున్నారు.
అయితే గ్రామంలో భూగర్భ జలాలు తగ్గిపోతాయని, తమ గ్రామానికి భవిష్యత్తులో నీటి సమస్య మరింత తీవ్రమవుతుందనే ఆందోళనతో గ్రామస్థులు అధికారులను అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ, ఇప్పటికే వేంపల్లి పంచాయతీలో తీవ్ర తాగునీటి సమస్య నెలకొని ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో మున్సిపాలిటీ అవసరాల కోసం బోరు తవ్వితే గ్రామంలోని భూగర్భ జలాలు మరింత తగ్గిపోయి తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులకు వివరించారు.
గ్రామ ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా బోరు తవ్వకాలు చేపట్టవద్దని వారు డిమాండ్ చేశారు.
దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, అధికారులు గ్రామస్థులతో చర్చలు జరిపి పరిస్థితిని సమీక్షించారు.
తదుపరి నిర్ణయం తీసుకునే వరకు బోరు తవ్వకాలపై స్పష్టత రాలేదు.




