Ramasamudram: రామసముద్రంలో ఓటరు జాబితా సవరణపై అవగాహన!

Ramasamudram: అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం గంపనపల్లిలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SSR) అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Srinivasulu, Madanapalle
Published on: 3 July 2026 5:15 PM IST
Ramasamudram
X

Ramasamudram: రామసముద్రంలో ఓటరు జాబితా సవరణపై అవగాహన!

రామసముద్రం: అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం ఊలపాడు పంచాయతీ గంపనపల్లి గ్రామంలో వైసీపీ మండల బీసీ సెల్ అధ్యక్షుడు రెడ్డి వీరేగౌడ్ ఆధ్వర్యంలో ఎస్.ఐ.ఆర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు.

అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను పరిశీలించుకోవాలని, కొత్తగా అర్హత పొందిన వారు పేర్లు నమోదు చేసుకోవాలని, వివరాల్లో తప్పులు ఉంటే వెంటనే సవరించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రెడ్డి వీరేగౌడ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని, ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని ఓటరు జాబితాను సరిచేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎస్.ఐ.ఆర్ కార్యక్రమం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story