puthalapattu : ఐరాల మండలాల్లో కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన!

puthalapattu : ఐరాల మండలాల్లో ఓటర్ల ప్రత్యేక సవరణ సర్వేను కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. 2002 ఓటర్ లిస్ట్‌తో సెల్ఫ్ మ్యాపింగ్ చేసుకోవాలని ప్రజలకు సూచించారు

VASU, PUTTALAPATTU
Published on: 7 July 2026 9:27 PM IST
puthalapattu
X

puthalapattu: పూతలపట్టు, ఐరాల మండలాల్లో కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన!

పూతలపట్టు, జూలై 7: జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించి తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం పూతలపట్టు మండలం తలపలపల్లి గ్రామంలోని బంధార్లపల్లి (పీఎస్-59), కర్ణంవారిపల్లి–పోటుగనుమ (పీఎస్-49), అలాగే ఐరాల మండలం పొలకలలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ సర్వేను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బీఎల్ఓలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, ఓటర్ల వివరాల నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజలతో మాట్లాడుతూ.

2002 ఓటర్ లిస్ట్ లో మీ అమ్మ లేదా నాన్న పేరు సీరియల్ నెంబర్ తెలుసుకోవాలన్నారు. అలా చేయకపోతే మీరు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.బి, ఎల్వో,లు ఇంటి వద్దకు వచ్చినప్పుడు ఓటు కోల్పోకుండా చూసుకోవడం మన అందరి బాధ్యత, తప్పకుండా మ్యాపింగ్ చేయించుకోవాలన్నారు 2002 సర్ ఓటర్ లిస్టులో పేరు ఉండి అదేవిధంగా 2025 ఓటర్ లిస్టులో పేరు ఉన్నవారు కూడా సెల్ఫ్ మ్యాపింగ్ చేయించుకుంటే మంచిది అన్నారు. అలాంటివారు బి, ఎల్, వో,లు వద్దకు వెళ్లి సెల్ఫ్ మ్యాపింగ్ అని చెప్పాలన్నారు. 2002 సమయంలో ఓటు హక్కు వయసు లేకపోయినా పేరు లేకపోయినా 2025 ఓటర్ లిస్టులో పేరు ఉన్నవారికి మ్యాపింగ్ వర్తిస్తుందన్నారు.

ప్రతి అర్హత కలిగిన ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలను నిబంధనల మేరకు నమోదు చేయాలని సూచించారు. సేకరించిన సమాచారాన్ని వెంటనే డిజిటలైజ్ చేసి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఓటర్ల జాబితా రూపొందించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, సంబంధిత తహసీల్దార్లు, బీఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU

Next Story