Varadaiahpalem: వరదయ్యపాలెం చాక్లెట్ కంపెనీలో విషాదం కార్మికుడి మృతి!
Varadaiahpalem: తిరుపతి జిల్లా వరదయ్యపాలెం డిపి చాక్లెట్స్ పరిశ్రమలో యాజమాన్యం నిర్లక్ష్యంతో కార్మికుడు సునీల్ మృతి. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల ఆందోళన.
Varadaiahpalem: వరదయ్యపాలెం చాక్లెట్ కంపెనీలో విషాదం కార్మికుడి మృతి!
Varadaiahpalem:
* తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం కంచరపాలెం సమీపంలో ఉన్న డీపీ చాక్లెట్స్ కంపెనీలో ఈ రోజు ఘోరప్రమాదం సంబవించింది..
* బుచ్చినాయుడు కండ్రిగ మండల వెస్ట్ వత్తూర్ గ్రామానికి చెందిన కనపర్తి సునీల్ అనే యువకుడు డిపి చాక్లెట్ కంపెనీ నిర్లక్ష్యం వల్ల ప్రమాదంలో కార్మికుడు కనపర్తి సునీల్ మృతి చెందినట్టు స్థానికులు తెలియజేసారు
* కంపెనీ యాజమాన్యం మరియు సేఫ్టీ అధికారుల ఘోర నిర్లక్ష్యం కారణంగా కనపర్తి సునీల్ (33) అనే యువకుడు మృతి చెందాడు.ఘటన నేపథ్యం:కంపెనీ ప్రాంగణంలో కనీస రక్షణ చర్యలు పాటించకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అని తెలుస్తుంది
* ప్రమాదం జరిగిన స్థలంలో తీవ్రమైన రక్తపు మడుగులు, పడి ఉన్న సునీల్ ని తడ మిత్ర హాస్పిటల్ కు తరలించగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు, అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని సత్యవేడు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు...
* సమాచారం అందుకున్న గ్రామస్థులు మరియు బంధువులు కంపెనీ బయట ధర్నాకు దిగారు, తమ కుమారుడు ప్రాణాలు తీసారని భద్రత లోపలవళ్లే అతను చనిపోయ్యాడని, ఆ కుటుంబం రోడ్డున పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు..
* ఈ ప్రమాదానికి కాణమైన కంపెనీ నిర్లక్ష్యపు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయం జరిగే వరకు వెనకడుగు వేసేది లేదని హెచ్చరిస్తున్నారు.
* సమాచారం అందుకున్న స్థానిక పోలీస్ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబసభ్యులతో చర్చించారు. అనంతరం కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




