Yadamari: యాదమరిలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఎన్నికల ప్రచారం

Yadamari: యాదమరి మండలంలో టీడీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రచారం. బజ్జీలు వేసి ఓటర్లను ఆకట్టుకున్న ఎమ్మెల్యే.

VASU, PUTTALAPATTU
Published on: 2 Nov 2026 10:27 PM IST
Yadamari
X

Yadamari: యాదమరిలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఎన్నికల ప్రచారం

యాదమరి: స్థానిక ఎన్నికల సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలములో ఎంపీటీసీ అభ్యర్థులను అఖండ విజయంతో గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి బంగారు బాట వేసిన వ్యక్తి మహానుభావులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే అన్నారు.

రాష్ట్ర అభివృద్ధికి పల్లెలే పట్టుకొమ్మలుగా భావించి పల్లెటూర్లలో సిసి రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీలు, విద్యుత్ మొదలైన మెరుగైన సౌకర్యాలను ప్రజలకు తెలుగుదేశం ప్రభుత్వం అందించింది అన్నారు.

మరింతగా గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పూతలపట్టు నియోజకవర్గంలోని కూటమి ప్రభుత్వం తరఫున పోటీ చేస్తున్న జడ్పిటిసి,ఎంపీటీసీ అభ్యర్థులను అఖండ విజయంతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ప్రచారంలో భాగంగా యాదమరి ప్రధాన రహదారిలో వ్యాపార సముదా య లందు ప్రచారం నిర్వహించి మిరపకాయ బజ్జీల అంగడి నందు ఎమ్మెల్యే బజ్జీలు నివేసి అందరికీ పంచి పెట్టారు.

ఈ కార్యక్రమంలో యాదమరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మొరార్జీ యాదవ్ ఎంపీటీసీ అభ్యర్థి రవీంద్ర మొదలి తెలుగుదేశం పార్టీ నాయకులు ,కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU