Madanapalle: మదనపల్లె వైఎస్సార్ 77వ జయంతి సందర్భంగా పండ్ల పంపిణీ
Madanapalle: మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు. హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన వైఎస్సార్సీపీ నాయకులు.
Madanapalle: మదనపల్లె వైఎస్సార్ 77వ జయంతి సందర్భంగా పండ్ల పంపిణీ
మదనపల్లె: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా మదనపల్లె సర్వబోధన ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో బుధవారం పండ్లు, బ్రెడ్ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాజంపేట ఎంపీ పి.వి. మిథున్ రెడ్డి, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జీవితాంతం సేవలందించిన మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను స్మరించుకుంటూ ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. వైఎస్సార్ పేదల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజల పట్ల ఆయన చూపిన మానవత్వం చిరస్మరణీయమని కొనియాడారు.
ఆయన చూపిన సేవా మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగుల సహాయకులు, ప్రజలకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భయ్యా రెడ్డి, అశోక్ రాయల్, కౌశిక్ రాజు, గోవా బ్రదర్స్, రెడ్డి భాస్కర్, గిరీష్,దీపు, వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని మహానేత వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.




