Chittoor: చిత్తూరు ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు
Chittoor: చిత్తూరులో వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు. డీసీసీ బ్యాంకు వద్ద విగ్రహానికి నివాళులర్పించిన వైసీపీ సమన్వయకర్త ఎంసీ విజయానంద రెడ్డి మరియు పార్టీ శ్రేణులు.
Chittoor: చిత్తూరు ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు
చిత్తూరు: చిత్తూరు జిల్లా కేంద్రంలో ఈ రోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చిత్తూరు డీసీసీ బ్యాంకు ఆవరణలో ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్ విగ్రహానికి చిత్తూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎంసీ విజయానంద రెడ్డి గారు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వైయస్‌ఆర్ సేవలను స్మరించుకున్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని నాయకులు పేర్కొన్నారు.పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై మహానేతకు తమ నివాళులను అర్పించారు.
Next Story




