Madanapalle: వూలపాడులో ఎంపీటీసీ అభ్యర్థి నారాయణ ప్రచారం!

Madanapalle: అన్నమయ్య జిల్లా ఊలపాడులో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి నారాయణ గ్రామాభివృద్ధే లక్ష్యంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తించారు.

Srinivasulu, Madanapalle
Published on: 30 Oct 2026 7:45 PM IST
Madanapalle
X

Madanapalle: వూలపాడులో ఎంపీటీసీ అభ్యర్థి నారాయణ ప్రచారం!

Madanapalle: మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం ఊలపాడు పంచాయతీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి నారాయణ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గ్రామంలోని వివిధ వీధుల్లో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. స్థానిక ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా ఎంపీటీసీ అభ్యర్థి నారాయణ మాట్లాడుతూ.. గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ప్రజాప్రతినిధులుగా బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఊలపాడు పంచాయతీలో మౌలిక వసతుల కల్పన, తాగునీరు, రహదారులు, పారిశుధ్యం వంటి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి తనకు ఒక అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు. ప్రచార కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle