Puthalapattu: పూతలపట్టులో వైఎస్ఆర్సీపీ ధర్నా

Puthalapattu: పూతలపట్టు అంబేద్కర్‌ సర్కిల్‌లో వైఎస్ఆర్సీపీ నిరసన గళం.

VASU, PUTTALAPATTU
Published on: 5 Jun 2026 10:46 AM IST
Puthalapattu
X

Puthalapattu: పూతలపట్టులో వైఎస్ఆర్సీపీ ధర్నా

పూతలపట్టు: పూతలపట్టు నియోజకవర్గం లో పూతలపట్టు మండల కేంద్రంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమలో భాగంగా నిరసన నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు సీఎంగా రెండేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన అన్ని వర్గాల వారినీ నిస్సహాయ స్థితిలో నెట్టి వేయడం జరిగిందని ఆయన ఎద్దేవా చేశారు.

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డీఎస్సీ రాసిన అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వక అనకులకు ఉద్యోగాలు రావడానికి తోడ్పడ్డారని ఆయన ఈ సందర్భంగా తీవ్రంగా విమర్శించారు. పూతలపట్టు మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా అన్యాయం చేశాడని ఆయన తీవ్రంగా విమర్శించారు.

చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తిగా ఇవ్వకుండా అరకురాగా ఇస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. తొందర్లో ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU

Next Story