Tirupati: వైసిపి నాయకుడు కామిరెడ్డి జగన్ సీఎం అయ్యే వరకు విశ్రమించం!

Tirupati: పెళ్లకూరు మండలంలో వైసిపి నాయకులపై అక్రమ కేసులు బనాయించారని కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆగ్రహం. జగన్ సీఎం అయ్యే వరకు పోరాడతామని స్పష్టం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Aug 2026 12:10 PM IST
Tirupati
X

Tirupati: వైసిపి నాయకుడు కామిరెడ్డి జగన్ సీఎం అయ్యే వరకు విశ్రమించం!

Tirupati: తిరుపతి జిల్లా పెళ్ళాకూరు మండలంలోని చిల్లకూరు గ్రామంలో గల వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవరకు రాష్ట్రంలో వైసిపి నాయకులు ఉద్యమిస్తూనే ఉంటారని తెలియజేయడం జరిగింది.

ఈ నెల 20 వ తేదీన పెళ్లకూరు మండలం పునబాక గ్రామంలో జరిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్సిపి నాయకుల మధ్య వివాదం లో వైసీపీ నాయకులు 27 మందిపై కేసులు నమోదవడం జరిగింది, కేవలం వైసీపీ నాయకుల పైనే కేసులు పోలీసులు నమోదు చేయడంపై వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఘాటుగా స్పందించడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ పోలీసులు పసుపు చొక్కాలు వేసుకొని విధులు నిర్వహిస్తున్నారని "గుడ్ మార్నింగ్ పెళ్ళకూరు" కార్యక్రమంలో పునబాక గ్రామంలో జరిగిన వివాదంలో కేవలం వైసీపీ నాయకుల మీద కేసులు నమోదు చేయడం తెలుగుదేశం పార్టీ నాయకులపై కనీస చర్యలు కూడా తీసుకుపోకపోవడం కూటమి ప్రభుత్వంలో పోలీసులు ఎలా పనిచేస్తున్నారు అన్న విషయం తెలుస్తుందని ముఖ్యంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో పోలీసులు పసుపు చొక్కాలు వేసుకొని విధులు నిర్వహిస్తున్నారని కేవలం వైసీపీ నాయకులను అడ్డుకోవడమే పనిగా పోలీసులు పనిచేస్తుండడం ప్రజలు గమనిస్తున్నారని ఆయన తెలియజేయడం జరిగింది.

ఇలాంటి అరెస్టులతో వైసిపి నాయకులను అడ్డుకోలేరని 2029 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ అధ్యక్షులు వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా వైసిపి నాయకులు ఉద్యమిస్తారని ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి తెలియపరచడం జరిగింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story