Srikalahasti: పార్టీకి ప్రజలే బలం – ప్రజలకు వెన్నుదన్నుగా జగన్ 2.0 యాప్
Srikalahasti: మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి "జగన్ 2.0" యాప్ పోస్టర్లను ఆవిష్కరించారు.
Srikalahasti: పార్టీకి ప్రజలే బలం – ప్రజలకు వెన్నుదన్నుగా జగన్ 2.0 యాప్
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణంలోని వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి "పార్టీకి ప్రజలే బలం – ప్రజలకు వెన్నుదన్నుగా జగన్ 2.0 యాప్" పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆకర్ష్ రెడ్డి మాట్లాడుతూ... పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై సమాచారం, పార్టీ అధికారిక ప్రకటనలు, ప్రెస్‌మీట్‌లు, ప్రజా ఉద్యమాలకు సంబంధించిన వివరాలను ప్రజలకు వేగంగా చేరవేయడంలో జగన్ 2.0 యాప్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త, అభిమాని తప్పనిసరిగా జగన్ 2.0 యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




