Chittoor: హత్యాయత్నం కేసులో పోలీసుల స్పందన కరువు.. వైసీపీ నేత ఆరోపణ!

Chittoor: తనపై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసుల నుంచి స్పందన లేదని రామకుప్పం మండలం దామనబోయనపల్లికి చెందిన వైసీపీ నేత కుందనదనరెడ్డి ఆరోపించారు.

Chandra Sekhar, Chittoor
Published on: 25 Nov 2026 3:21 PM IST
Chittoor
X

Chittoor: హత్యాయత్నం కేసులో పోలీసుల స్పందన కరువు.. వైసీపీ నేత ఆరోపణ!

Chittoor: తనపై హత్యాయత్నం జరిగిందని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని రామకుప్పం మండలం దామనబోయనపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు కుందనదనరెడ్డి ఆరోపించారు.

చిత్తూరు ప్రెస్ క్లబ్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఆనందరెడ్డి రాజకీయ కక్షతో గత ఏడాది మార్చి 21న తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.అంతేకాకుండా గ్రామంలోకి తనను రానీయకుండా కొందరు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వాపోయారు.

రాష్ట్ర, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించి తనకు రక్షణ కల్పించాలని, గ్రామానికి వెళ్లేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor