Madanapalle: మదనపల్లెలో వైఎస్సార్‌సీపీ నేతపై దాడి: తీవ్ర ఉద్రిక్తత
Madanapalle: మదనపల్లెలో ఓటు వేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేత తాలే సుబ్రహ్మణ్యంపై 20 మంది ముసుగు దుండగులు దాడి చేసి నగలు, సెల్‌ఫోన్ దోచుకెళ్లినట్లు ఆరోపణ.
Madanapalle: మదనపల్లెలో వైఎస్సార్‌సీపీ నేతపై దాడి: తీవ్ర ఉద్రిక్తత
మదనపల్లె: మదనపల్లె పట్టణంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకుడు, మేధార సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు తాలే సుబ్రహ్మణ్యంపై దాడి జరిగినట్లు ఆరోపణలు కలకలం రేపాయి.
29వ వార్డు అవెన్యూ రోడ్డులోని ఉర్దూ పాఠశాలలో ఓటు వేసేందుకు వెళ్లిన సమయంలో సుమారు 20 మంది ముసుగులు ధరించిన వ్యక్తులు తనను బలవంతంగా సప్తగిరి గ్రామీణ బ్యాంకు సందులోకి తీసుకెళ్లి దాడి చేశారని బాధితుడు ఆరోపించారు.
ఈ దాడిలో తనకు తలకు తీవ్ర గాయమైందని, తన వద్ద ఉన్న రూ.45 వేల విలువైన సెల్‌ఫోన్, 18 గ్రాముల బంగారు గొలుసును అపహరించారని తెలిపారు. వైఎస్సార్‌సీపీకి చెందిన వారు ఈ ప్రాంతంలో కనిపించకూడదంటూ బెదిరించినట్లు పేర్కొన్నారు.
ఈ ఘటనపై అన్నమయ్య జిల్లా ఎస్పీ స్పందించి దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు ప్రాణహాని ఉన్నందున పోలీసు రక్షణ కల్పించాలని తాలే సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు.




