Madanapalle: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బర్త్‌డే వేడుకలు!
Madanapalle: మదనపల్లె 21వ వార్డులో వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు.
Madanapalle: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బర్త్‌డే వేడుకలు!
Madanapalle: మదనపల్లె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను మదనపల్లె పట్టణంలోని 21వ వార్డులో ఘనంగా నిర్వహించారు. వక్ఫ్ బోర్డు చైర్మన్, స్టేట్ మైనారిటీ సెక్రటరీ ఎస్.ఏ. కరీముల్లా, మాజీ కౌన్సిలర్ షబానా, ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్.ఏ కరీముల్లా మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషి కొనసాగాలని కోరుకున్నారు.
ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ రెడ్డి, ఎస్ ఇబ్రహీం, మసీద్ ముత్తవల్లి, ఎర్రం రెడ్డి రమాదేవి, మాజీ స్టేట్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ వలసపల్లి రవి, వార్డ్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.




