Chittoor: డీఎస్సీ పరీక్షల అక్రమాలపై చిత్తూరు నగరంలో వైసీపీ శ్రేణుల నిరసన

Chittoor: ఎంసీ విజయానంద రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో డీఎస్సీ అక్రమాలపై ర్యాలీ నిర్వహించి, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 28 July 2026 5:57 PM IST
Chittoor
X

Chittoor: డీఎస్సీ పరీక్షల అక్రమాలపై చిత్తూరు నగరంలో వైసీపీ శ్రేణుల నిరసన

చిత్తూర్: డీఎస్సీ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీ జరిగాయని ఆరోపిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని చిత్తూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చిత్తూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎంసీ విజయానంద రెడ్డి ఆధ్వర్యంలో యువజన, విద్యార్థి విభాగాల నాయకులు చిత్తూరులో నిరసన కార్యక్రమం చేపట్టారు. గాంధీ సర్కిల్ నుంచి దర్గా సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, డీఎస్సీ పరీక్షల నిర్వహణలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఎంసీ విజయానంద రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. డీఎస్సీ పరీక్షల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

అనర్హులకు ఉద్యోగాలు కల్పించి అర్హులైన నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని ఆరోపించిన ఆయన, డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, వైసీపీ.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story