Chittoor: వైకాపా లీగల్ సెల్ కార్యదర్శి సుగుణశేఖర్ రెడ్డిపై దాడి!
Chittoor: చిత్తూరులో వైకాపా లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి సుగుణశేఖర్ రెడ్డిపై దాడి అమానుషం. కూటమి నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.
Chittoor: వైకాపా లీగల్ సెల్ కార్యదర్శి సుగుణశేఖర్ రెడ్డిపై దాడి!
Chittoor: వైకాపా రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి సుగుణశేఖర్ రెడ్డి పై దాడి చేయడాన్ని వైకాపా లీగల్ సెల్ నాయకులు తీవ్రంగా ఖండించారు. బుధవారం నగరంలోని చిత్తూరు నియోజకవర్గ వైయస్సార్సీపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైకాపా లీగల్ ప్రతినిధులు మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో వైకాపా లీగల్ సెల్ వైకాపా అభ్యర్థుల నామినేషన్లు, బి ఫారమ్ లు సక్రమంగా ఉన్నాయా లేవా అని పరిశీలనలో భాగంగా బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయం వర్ధకు వెళ్లిన ప్రముఖ న్యాయవాది, రాష్ట్ర వైకాపా లీగల్ సెల్ కార్యదర్శి సుగుణశేఖర్ రెడ్డి పై కూటమి నాయకులు దాడి చేయడం, ఆయన మొబైల్ ఫోన్ ను లాక్కోవడంతో పాటు మెడలోని బంగారు గొలుసును లాక్కున్నట్లు తెలిపారు.
తనపై దాడి చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చిత్తూరు 1వ పట్టణ పోలీసులు వచ్చి తనపై దాడి చేసిన వారి నుంచి తనను కాపాడకపోయి ఉంటే తన ప్రాణాలు పోయేవని సుగుణశేఖర్ రెడ్డి వాపోయారు.




