Palamaner: వైఎస్సార్సీపీ సమరశంఖం.. ఐడీ కార్డుల పంపిణీ, ఎన్నికలకు పిలుపు!

Palamaner: పలమనేరులో వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం. భూమన కరుణాకర్ రెడ్డి, వెంకటే గౌడ ఆధ్వర్యంలో కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ & స్థానిక ఎన్నికలకు కార్యాచరణ.

SUBRAMANYAM, PALAMANERU
Published on: 9 Sept 2026 4:54 PM IST
Palamaner
X

Palamaner: వైఎస్సార్సీపీ సమరశంఖం.. ఐడీ కార్డుల పంపిణీ, ఎన్నికలకు పిలుపు!

Palamaner: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు మరియు పలమనేరు మాజీ శాసనసభ్యులు శ్రీ వెంకటే గౌడ గారి ఆధ్వర్యంలో పలమనేరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చిన్నచిన్న విభేదాలను పక్కనపెట్టి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఒక్కతాటిపైకి వచ్చి సమష్టిగా పనిచేయాలని, ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధం కావాలని సూచించారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై జిల్లా అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు.

కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీల అమలులో జాప్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా కార్యకర్తలు భయపడకుండా ఐక్యంగా పనిచేసి ప్రజలకు అండగా నిలవాలి. ప్రతి గ్రామంలో పార్టీ జెండా బలంగా ఎగరాలి.. ప్రతి కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉండాలి.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని శ్రీ వెంకటే గౌడ గారు పిలుపునిచ్చారు.

అనంతరం పార్టీ శ్రేణులకు ఐడీ గుర్తింపు కార్డులను పంపిణీ చేసి, ప్రతి కార్యకర్త పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అందుబాటులో ఉండాలని అలాగే ఈ గుర్తింపు కార్డులు కల్గిన కార్యకర్తలు భవిష్యత్తులో పార్టీ నుంచి అనేక ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు వెంకట రెడ్డి యాదవ్ ,నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SUBRAMANYAM, PALAMANERU

SUBRAMANYAM, PALAMANERU

Next Story