Punganur: మల్లయ్య కొండ మైనింగ్ వివాదం.. ప్రభుత్వంపై పెద్దిరెడ్డి ఫైర్!
Punganur: అన్నమయ్య జిల్లాలోని పవిత్ర మల్లయ్య కొండలో మైనింగ్ తవ్వకాల వ్యవహారం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది.
Punganur: మల్లయ్య కొండ మైనింగ్ వివాదం.. ప్రభుత్వంపై పెద్దిరెడ్డి ఫైర్!
Punganur: అన్నమయ్య జిల్లాలోని మల్లయ్య కొండలో మైనింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. కూటమి ప్రభుత్వం పవిత్ర మల్లయ్య కొండలో ఇనుప ఖనిజం తవ్వకాలకు అనుమతులు ఇచ్చి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.
మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో మైనింగ్ అనుమతులు ఉన్నప్పటికీ భక్తుల మనోభావాలను గౌరవించి తవ్వకాలను నిలిపివేశామని తెలిపారు. ఆలయ అభివృద్ధికి సుమారు రూ.20 కోట్లతో రోడ్లు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎర్రకొండ, సాధుకొండ, శివపురం ప్రాంతాల్లో మైనింగ్‌కు టెండర్లు పిలిచి ప్రైవేట్ సంస్థలకు అనుమతులు ఇచ్చిందని ఆరోపించారు. మల్లయ్య కొండలో మైనింగ్ చేపడితే భక్తులతో కలిసి వైసీపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. అలాగే రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పెద్దిరెడ్డి విమర్శించారు.




