Puthalapattu: పూతలపట్టులో వైఎస్సార్‌సీపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు!

Puthalapattu: పూతలపట్టులో డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ ఆధ్వర్యంలోర్యాలీ నిర్వహించారు పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

VASU, PUTTALAPATTU
Published on: 10 Aug 2026 2:50 PM IST
Puthalapattu
X

Puthalapattu: పూతలపట్టులో వైఎస్సార్‌సీపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు!

Puthalapattu: పూతలపట్టు మండల కేంద్రంలోని ఎస్వి కళ్యాణమండపం నుండి వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ర్యాలీగా పూతలపట్టు పురవీధుల గుండా మెగా డీఎస్సీ, దగా డిఎస్సి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని నినాదాలు చేశారు.

ర్యాలీగా వెళ్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేశ క్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, పోలీసులకు తోపులాట జరిగింది.

ఈ క్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి పార్టీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే పోలీసులు కార్యకర్తల అడ్డుకోవడం మంచి పద్ధతి కాదన్నారు.

డీఎస్సీ అవకతవకలపై సిబిఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మేధావుల సంఘం సలహాదారులు జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుమార్ రాజా, మండల కన్వీనర్లు, బుజ్జి రెడ్డి, సుధాకర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, రామచంద్రారెడ్డి, హరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU

Next Story