Madanapalle: డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్‌సీపీ నిరసన
Madanapalle: అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది.
Madanapalle: డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్‌సీపీ నిరసన
Madanapalle: మదనపల్లె :డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని, నియామక ప్రక్రియలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్, పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతకు భారీ హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
డీఎస్సీ ప్రక్రియలో చోటుచేసుకున్న అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి, అర్హత కలిగిన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. ఉద్యోగాల కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత ఆశలను ప్రభుత్వం వమ్ము చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు సమర్పించారు. డీఎస్సీ అభ్యర్థులకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్, మండల దళిత నాయకుల శేషాద్రి, వైఎస్ఆర్సిపి మండల సెక్రెటరీ అంబరీష్,వార్డు మెంబర్ వెంకటేష్, మండల వైఎస్సార్సీపీ లీడర్ బాలాజీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




