Madanapalle: యువతపై అక్రమ కేసులు, వేధింపులు ఆపాలి: మదనపల్లె వైసీపీ నేత హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్

Madanapalle: రాష్ట్రంలో యువతపై అక్రమ కేసులు, వేధింపులు పెరిగిపోతున్నాయని మదనపల్లె వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

Srinivasulu, Madanapalle
Published on: 14 May 2026 8:09 AM IST
Madanapalle: యువతపై అక్రమ కేసులు, వేధింపులు ఆపాలి: మదనపల్లె వైసీపీ నేత హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్
X

మదనపల్లె (అన్నమయ్య జిల్లా): మదనపల్లె వైసీపీ ఇన్‌చార్జ్‌ నిస్సార్ అహ్మద్, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ ఆదేశాల మేరకు యువజన విభాగం అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో యువతపై ఒత్తిళ్లు, అక్రమ కేసులు, వేధింపులు పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన యువతను టార్గెట్ చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై స్పందించే గొంతులను అణచివేయడానికి అక్రమ కేసులు, బెదిరింపులు ఉపయోగించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ప్రభుత్వం వెంటనే యువతపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story