Charala: కబడ్డీలో చారాల స్కూల్ హవా.. జిల్లా పోటీలకు హేమశ్రీ, నేత్ర ఎంపిక!
Charala: సదుం లో జరిగిన అమరావతి ఛాంపియన్షిప్ కబాడీ సెలక్షన్స్ లో చారాల ఉన్నత పాఠశాల విద్యార్థినులు హేమశ్రీ, నేత్ర జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
Charala: కబడ్డీలో చారాల స్కూల్ హవా.. జిల్లా పోటీలకు హేమశ్రీ, నేత్ర ఎంపిక!
చారల: సదుం జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల వేదికగా ఈ నెల 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహించిన అమరావతి ఛాంపియన్షిప్ పుంగనూరు నియోజకవర్గ స్థాయి కబాడీ సెలక్షన్స్ లో చారాల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారన్నారు
ఈ ఎంపిక పోటీలలో పాఠశాలకు చెందిన హేమశ్రీ (9వ తరగతి), నేత్ర (10వ తరగతి) అనే ఇద్దరు విద్యార్థినులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు బాలికలు ఎంపికైన పట్ల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి రేణుక హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో ఇదే రకమైన ప్రతిభను కనబరిచి, జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. ప్రతిభతో పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థినులను ఈ సందర్భంగా అభినందించారు.
వారితోపాటు ఉపాధ్యాయులు సహదేవయ్య, సుబ్రహ్మణ్యం, నాగరాజు, రమణ బాబు, నారాయణ, మార్ కొండయ్య, శరత్ చంద్ర, రూబీ రాణి, ప్రతిమ, వరలక్ష్మి, శ్రీదేవి, అయిషా, వీణా, వెంకటరత్నమ్మ తదితరులు విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.




