Nellore: ఆత్మకూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం!

Nellore: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నారంపేట వద్ద ట్రాక్టర్ ఆటోను ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 28 July 2026 1:44 PM IST
Nellore
X

Nellore: ఆత్మకూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం!

Nellore: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని నారంపేట సమీపంలో నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ అతివేగం వచ్చి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరికీ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

పోలీసుల సమాచారం మేరకు నెల్లూరు వెంకటేశ్వరపురం కు చెందిన ఓ కుటుంబం పెళ్లి సంబంధం విషయమై సోమవారం మైదుకూరుకు వెళ్లారు. రాత్రి ఆలస్యం కావడంతో మైదుకూరు నుంచి ఉదయం బయలుదేరి నారంపేట సమీపంలోకి వచ్చేసరికి అతివేగంగా వస్తున్న గ్రావెల్ ట్రాక్టర్ మలుపు తిప్పే క్రమంలో ఆటోను ఢీకొట్టింది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

108 వాహనంలో క్షతగాత్రులను ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు.సిఐ గంగాధర్, ఎస్సై జంపానీ కుమార్ లు ఆసుపత్రిలో క్షతగాత్రుల వద్ద వివరాలను నమోదు చేశారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జంపానీ కుమార్ మీడియాకు వివరించారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story