Adilabad: రిమ్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఏసీ పేలి చిన్నారి మృతి!

Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి ఎన్‌బీసీసీ వార్డులో ఏసీ పేలి అగ్నిప్రమాదం. ఊపిరాడక చిన్నారి మృతి, తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Sept 2026 10:49 AM IST
Adilabad
X

Adilabad: రిమ్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఏసీ పేలి చిన్నారి మృతి!

Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్‌లో ఏసీ పేలడంతో వార్డులో ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఊపిరాడక ఓ చిన్నారి మృతి చెందింది. ఘటన సమయంలో వార్డులో మొత్తం 27 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం.

పొగలు వ్యాపించడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఎత్తుకుని వార్డు నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనతో ఆస్పత్రి వద్ద తీవ్ర ఆందోళన నెలకొంది. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఘటన స్థలాన్ని పరిశీలించారు. చిన్నారులను మూడు అంబులెన్సుల్లో సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇద్దరు చిన్నారులు చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు. చిన్నారుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

నిరంతరం వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్